వైభవంగా రావణ దహనం
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:50 PM
శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి రావణ దహన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
అరసవల్లి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి రావణ దహన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్ర మాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన డం ఆనందంగా ఉందన్నారు. చెడుపై విజయమే ఈ రావణదహన కార్యక్రమం అన్నారు. 50 అడుగుల ఎత్తైన రావణుని బొమ్మను తయారుచేసి బాణసంచా వెలుగుల మధ్య కేంద్రమంత్రి విల్లు ఎక్కుపెట్టి దహనం చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.