Share News

గిరిజన ప్రాంతాల్లో ‘రేషన్‌’ ఇబ్బందులు

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:25 AM

గిరిజన ప్రాంతాల్లో రేషన్‌ ఇబ్బం దులున్నాయని ముఖ్య మంత్రి చంద్రబాబుకి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విన్నవించారు.

గిరిజన ప్రాంతాల్లో ‘రేషన్‌’ ఇబ్బందులు
సీఎంకు సమస్య వివరిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • ముఖ్యమంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే గోవిందరావు

శ్రీకాకుళం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో రేషన్‌ ఇబ్బం దులున్నాయని ముఖ్య మంత్రి చంద్రబాబుకి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విన్నవించారు. అమ రావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివా రం విస్తృత స్థాయి స మావేశం నిర్వహించారు. సమస్యలేమైనా ఉన్నా యా? అని సీఎం ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. దీనిపై పాతపట్నం ఎమ్మెల్యే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ‘గిరిజన ప్రాంతాల్లో రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక రేషన్‌ దుకాణం ఉంటుంది. దీనివల్ల ఆయా ప్రాంత గిరిజనులు సుమారు నాలుగు కిలోమీటర్లు వెళ్లి నిత్యావస సరుకులు తెచ్చు కుంటున్నారు. గిరిజనులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి’ అని విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిం చారు. గుడ్‌ క్వశ్చన్‌ అంటూ కొనియాడి.. గిరిజన ప్రాంతాల్లో రేషన్‌ పంపిణీ కోసం మొబైల్‌ వ్యాన్లను ఏర్పాటు చేద్దామని.. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నిర్ణయం త్వరలో తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - Jun 30 , 2025 | 12:25 AM