రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:37 PM
: కోదూరు పంచాయతీ పరిధిలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మంగళవారం ఆ పంచాయతీకి చెందిన ప్రహరాజపా లెం, కోదూరు గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.
పాతపట్నంరూరల్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కోదూరు పంచాయతీ పరిధిలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మంగళవారం ఆ పంచాయతీకి చెందిన ప్రహరాజపా లెం, కోదూరు గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. తాము రేషన్ తీసుకునేందుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బగంతర గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని వాపో యారు. సరైన రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందు లకు గురవుతున్నామని, ఆ గ్రామంలో నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా ఉండక రేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు తమ పంచాయతీకి కూతవేటు దూరంలో ఉన్న జీసీసీ డిపోలో రేషన్ ఇచ్చేవారని, మళ్లీ ఈ డిపోలోనే రేషన్ ఇచ్చే విధంగా సౌకర్యం కల్పించాలని, లేదా రేషన్ సబ్‌డిపోను కోదూరు పంచాయతీలో ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే తక్షణమే స్పం దించి తహసీల్దార్ నందిగాం ప్రసాదరావు, సీఎస్‌డీటీ కుమారి సమక్షంలో ఆర్డీవోకు ఫోన్‌చేసి సమస్యను వివరించారు. అందుకు ఆర్డీవో సానుకూలంగా స్పంది స్తూ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనవరి నుంచి కోదూరు, ప్రహరాజపాలెం గ్రామాల్లో రేషన్ పంపిణీకి ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్థులు లింగుమహంతి శ్రీదేవి, జాడ తులసి, పకీర్, జమాల్, రోజా తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
పాతపట్నం/హిరమండ లం, డిసెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): వైద్యం చేసుకునే ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు పడు తున్న కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. గొట్ట గ్రామానికి చెంది పొట్నూరు రమణయ్య అనారోగ్యంతో బాధపడుతుండ డంతో సీఎంఆర్‌ఎఫ్‌ద్వారా రూ.45,047 మంజూరైంది. ఈ మొత్తాన్ని మంగళవారం పాతపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాధితుడికి అందజేశారు. మరో లబ్ధిదారు పుచ్చల హేమలతకు రూ.లక్ష అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు దారపు ఢిల్లేశ్వరరావు, నాయకులు ఎస్.గోవింద, కె.సు ధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
పాతపట్నం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులను ఆదేశించారు. మంగళవా రం తన క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు, వ్యవసాయశాఖాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు పారద ర్శకంగా జరగాలని, తేమశాతం పేరిట వివాదాలకు తావివ్వవద్దని అధికారులకు సూచించారు.ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి లో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు.