రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:14 PM
అరసవల్లిలోని ప్రసిద్ధ సూర్యదేవాలయంలో జనవరి 25న చేపట్ట నున్న రథసప్తమి ఉత్స వాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.
శ్రీకాకుళం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని ప్రసిద్ధ సూర్యదేవాలయంలో జనవరి 25న చేపట్ట నున్న రథసప్తమి ఉత్స వాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కింజ రాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో రథ సప్తమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌లతో సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 25న రథసప్తమి కాగా వారం రోజుల ముందునుంచే ఈ ఉత్సవాలు నిర్వహించాలని సూచించా రు. 19 నుంచి ఉత్సవాలు ప్రారంభించాలన్నారు. చివరి మూడు రోజులు.. 23, 24, 25 తేదీలు మరింత అట్టహాసంగా జరగాలని ఆదేశించారు. ఉత్సవాల్లో విశేష ఆధ్యాత్మిక కార్యక్ర మాలతో పాటు క్రీడా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను భాగస్వామ్యం చేయాలని కోరారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రముఖులకు ఆహ్వానా లను పంపాలని సూచించారు.
పొందూరు ఖాదీ అభివృద్ధికి కృషి
పొందూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత పొందూరు ఖాదీకి, పొందూరులోని ఆంధ్ర సన్న ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. పొందూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు అనకాపల్లి చినరంగ ఆధ్వర్యంలో ఏఎఫ్‌కేకే సంఘం ప్రతినిధులు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు తెచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఖాదీకి భౌగోళిక గుర్తిం పునకు ఎమ్మెల్యే కూన రవికుమార్ సహకారంతో సాధించి నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఖాదీ అభివృద్ధికి గ్రాంట్లు, రుణాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. సంఘ భవనం నిర్మించి 75 ఏళ్లు పూర్తయిందని, శిథిలా వస్థకు చేరుకుందని నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గుంటుకు కామేశ్వరప్రసాద్, దండా వెంకటరమణ కోరారు. కార్మికులకు ఉచితంగా పరికరాలు అందించాలని కోరారు.