Share News

అరుదైన జాతికి చెందిన పాము మృతి

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:08 AM

జనావాసాలకు దూరంగా, గుబురైన పొదల్లో సంచరించే అత్యంత విషపూరితమైన ఓ అరుదైన జాతికి చెందిన పాము మృతి చెందింది.

అరుదైన జాతికి చెందిన పాము మృతి

పలాసరూరల్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జనావాసాలకు దూరంగా, గుబురైన పొదల్లో సంచరించే అత్యంత విషపూరితమైన ఓ అరుదైన జాతికి చెందిన పాము మృతి చెందింది. పెదంచల గ్రామ పరిధి పెదచెరువు వద్ద శనివారం గుబురుగా ఉన్న పొదల నుంచి కింగ్‌కోబ్రా జాతికి చెందిన బాండెడ్‌ క్రైట్‌ (చారలు కలిగిన) అనే పాము రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలో ఏదో ఒక వాహనం దానిపై నుంచి వెళ్లడంతో మృతి చెందింది. అత్యంత విషపూరితమైన ఇటువంటి పాములు పొలాలు, గుబురైన ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని స్నేక్‌క్యాచర్‌ ఓంకార్‌ తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున్న రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:08 AM