అనురాగ బంధాన్ని పెంపొందించే రాఖీ పండుగ
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:59 PM
సోదరి, సోదరుల మధ్య అనురాగ బంధాన్ని పెంపొందించేది రాఖీ పండుగ అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
- మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సోదరి, సోదరుల మధ్య అనురాగ బంధాన్ని పెంపొందించేది రాఖీ పండుగ అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు మహిళలు శనివారం ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సోదర బంధం అండగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకుటుంటారని అన్నారు.
సెప్టెంబరు 23 నుంచి కొత్తమ్మతల్లి ఉత్సవాలు
కొత్తమ్మతల్లి ఉత్సవాలను సెప్టెంబరు 23 నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం కొత్తమ్మతల్లి ఆలయ ప్రాంగ ణంలో అన్ని శాఖ అధికారులతో ఉత్సవాలపై సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్సవాల విజయ వంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. అరసవల్లి రథసప్తమి వేడుకలకు దీటుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట డ్రోన్ కెమెరాలు, వీఐపీ గేట్లు, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాల న్నారు. క్యూలైన్లలో ఎప్పటికప్పుడు పెద్దలకు నీరు, పిల్లలకు పాలు అందేలా చూడాలన్నారు. ఎటువంటి ఘర్షణలు లేకుండా పోలీసు లు, ఆలయ సిబ్బంది, వలంటీర్లు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, పార్టీ మండల అధ్యక్షుడు బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.