సాంకేతికతపై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:22 PM
technology awareness ‘వ్యవసాయంలో సాంకేతికతతోనే సత్ఫలితాలు సాధ్యం. ఆ దిశగా రైతులకు నూతన టెక్నాలజీపై అవగాహన కల్పించాల’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు.
- మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
కోటబొమ్మాళి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘వ్యవసాయంలో సాంకేతికతతోనే సత్ఫలితాలు సాధ్యం. ఆ దిశగా రైతులకు నూతన టెక్నాలజీపై అవగాహన కల్పించాల’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు. ఇటీవల పదోన్నతి పొందిన వ్యవసాయాధికారులు రాష్ట్ర సంఘ సభ్యులతో కలిసి ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేళ్లుగా పదోన్నతులకు నోచుకోని 22 మందికి మంత్రి చొరవతో డీడీఏల నుంచి వ్యవసాయ సంయుక్త సంచాలకులుగా పదోన్నతి లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ.. సాగు దిగుబడి పెంచి.. వ్యవసాయం లాభసాటిగా మార్చిలని మంత్రి వారికి సూచించారు. అలాగే ప్రజాదర్బార్ నిర్వహించి.. వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను మంత్రి స్వీకరించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ రాష్ట్ర సంఘం సభ్యులు డి. ప్రవీణ్, శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.