ఉగాదికి రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:42 PM
పలాసలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్లైఓవర్, కాశీబుగ్గ ఎంపీయూపీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న రైతు బజారును వచ్చే ఏడాది ఉగాదికి ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు తెలిపారు. ఆదివారం కాశీబుగ్గ రైల్వే వంతెన పనులు, రైతు బజారుకు స్థలాన్ని వారు పరిశీలించారు. రైతు బజారు నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పనులు వేగవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆదేశించారు.
కాశీబుగ్గ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పలాసలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్లైఓవర్, కాశీబుగ్గ ఎంపీయూపీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న రైతు బజారును వచ్చే ఏడాది ఉగాదికి ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు తెలిపారు. ఆదివారం కాశీబుగ్గ రైల్వే వంతెన పనులు, రైతు బజారుకు స్థలాన్ని వారు పరిశీలించారు. రైతు బజారు నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పనులు వేగవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ పంటలను ఇక్కడే విక్రయించవచ్చని అన్నారు. రైతులకు దుకాణాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో అందజేస్తామని అన్నారు. రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం అవుతున్నాయని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా దుకాణాలు తొలగించే బాధ్యతను అధికారుల తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని... హమీ ఇస్తే చేసి తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, ఏఏంసీ చైర్మన్ ఎం.శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు బడ్డ నాగరాజు, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, జోగ మల్లేశ్వరరావు, చంద్రశేఖర్‌త్యాడి, నరేంద్ర, సురేష్ కుమార్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం...
సంతబొమ్మాళి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం ఉద్దండపాలెం, పాలతలగాం గ్రామాలలో రూ.2 కోట్ల నాబార్డు-ఆర్‌ఐడీఎఫ్ నిధులతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రహదారులపై ఎక్కడా తట్టెడు మట్టి కూడా గత ప్రభుత్వం వే యలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. దీంతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించక అభివృద్ధి కుంటుపడిందన్నారు కూటమి ప్రభుత్వం మౌలిక వసతులకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. అనంతరం బోరుభద్రలో రూ.67 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు భవనాలను మంత్రి ప్రారంభించారు. గ్రామాల్లో రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. రహదారి పనుల్లో జాప్యం వల్ల కాలువల్లో దోమలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు పనులు వేగవంతం చేయాలని కంట్రాక్టర్ తాతారెడ్డిని ఆదేశించారు. పర్యవేక్షించాలని ఆర్డీవో కృష్ణమూర్తిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌చెర్మన్ బాడాన రమణమ్మ, పీఏసీఎస్ చైర్శన్ కూచెట్టి కాంతారావు, ఎల్‌ఎల్‌నాయుడు, రెడ్డి అప్పన్న, అట్డాడ రాంప్రసాద్, వజ్జ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన కుటుంబానికి
పరిహారం పంపిణీ
పలాస, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మందస మండలం సవర టుబ్బూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సవర బుద్ధయ్య, రూపమ్మలు గోడకూలి మృతి చెందిన సంఘటనపై ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందిస్తు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. ఆదివారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతు మృతుల కుటుంబానికి అన్నీ విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.