బాబోయ్ ట్రాఫిక్
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:54 PM
ఇచ్ఛాపురం రైల్వే ఉత్తర కేబిన్ ఎల్‌సీ గేట్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్రం గా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ వేశారంటే అరగంట ఆగాల్సిందే.
ఎల్‌సీ గేట్ వద్ద వాహనాల బారులు
రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అంటున్న వాహనచోదకులు
ఇచ్ఛాపురం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం రైల్వే ఉత్తర కేబిన్ ఎల్‌సీ గేట్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్రం గా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ వేశారంటే అరగంట ఆగాల్సిందే. రైలు రా కుండానే అరగంట ముందే గేట్ వేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వాహనచోదకులు మం డిపడుతున్నారు. మంగళవారం ఎల్‌సీ గేటు వేసి సుమారుగా 40 నిమిషాల పాటు తీయకపోవడంతో వాహనాలు బారులుతీరాయి. దీంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లీయర్ చేయాల్సి వచ్చింది. సుమారు గా అర కిలోమీటర్లు వరకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గేటు చాలా సమయం తీయకపోవడంతో స్కూల్స్‌కి, కళాశా లలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. కొంతమంది విద్యార్థులు సైకిళ్లను ఎత్తుకుని రైల్వే ట్రాక్ దాటారు. ఈ సమయంలో ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా రైల్లే అధికారులు సందించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.