నాణ్యమైన సేవలందించాలి: ఎంజీఆర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:58 PM
నాణ్యమైన సేవలం దించడమే లక్ష్యం కావాలని ఎమ్మెల్యే పాతపట్నం మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం/కొత్తూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన సేవలం దించడమే లక్ష్యం కావాలని ఎమ్మెల్యే పాతపట్నం మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో పాతపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం, మెళి యాపుట్టి మండలాల అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లకు 5జి ఫోన్లను ఎమ్మెల్యే మంగళవారం పంపిణీ చేశారు. అలాగే పాతపట్నంలో కొత్తూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 260 మంది కార్యకర్తలకు 5జీ సెల్ ఫోను ఎమ్మెల్యే మామాడిగోవిందరావు అందజేశారు.కార్యక్రమంలో సీడీపీవో ఉమా జానకి, సూపర్‌వైజరు గౌసీబేగం పాల్గొన్నారు.