Share News

నాణ్యమైన మందులు సరఫరా చేయాలి

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:49 PM

నాణ్యమైన మందులు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. రిమ్స్‌ ప్రాంగణంలో మంగళవారం ఔషధ నియం త్రణ కార్యాలయా న్ని ప్రారంభించారు.

నాణ్యమైన మందులు సరఫరా చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

పాత శ్రీకాకుళం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన మందులు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నా రు. రిమ్స్‌ ప్రాంగణంలో మంగళవారం ఔషధ నియం త్రణ కార్యాలయా న్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 కార్యాలయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వర్చువల్‌గా ప్రారంభించగా శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే శంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో ఎన్నో పనులు చేపడుతున్నారన్నారు. అలాగే రిమ్స్‌లో నూతన వైద్య ఉపకరణా లను ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రారంభించారు. 45 స్ట్రెక్చర్లు, బ్లడ్‌ బ్యాంక్‌ లో 900 యూనిట్ల నిల్వ సామర్థ్యం కలిగిన మైనస్‌ 40 డిగ్రీల ఫ్రీజర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వాషింగ్‌ మిషన్‌, ఇంట ర్నెట్‌ సదుపా యాన్ని కూడా అందు బాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్య క్రమంలో బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్ట్‌ చైర్మన్‌ అరవల రవీంద్రబాబు, జీ జీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.ప్రసన్నకుమార్‌, ప్రిన్సిపాల్‌ అప్పల నాయుడు, ఔషధ నియంత్రణాధికారి ఎన్‌.యుగంధర్‌, ఏపీఎంఐ సీడీఎస్‌ ఈఈ శిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:49 PM