నాణ్యమైన బోధన అందించాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:31 PM
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు అన్నారు.
పాతపట్నం, జూలై 1(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు అన్నారు. లాబర, బొమ్మిక గిరిజన బాలుర, బాలికల ఆశ్రమ పాఠ శాలలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతుల్లో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. విద్యా ర్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధన చేపట్టాలన్నారు. వంట గదులను, పాఠశాలల పరిసరాలను పరిశీలించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. నాణ్యమైన వంట పదార్థా లను విద్యార్థులకు అందిం చాలని, లేకుంటే సహించేది లేదని హెచ్చరిం చారు. ఆయన వెంట ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఏటీడ బ్ల్యూవో పి.సూర్యనారా యణ, ఎస్.త్రినాథరావు తదితరులున్నారు.