Share News

అన్ని ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరి

ABN , Publish Date - May 30 , 2025 | 11:54 PM

కాశీబుగ్గ పోలీసు సర్కిల్‌ పరిధిలో అన్ని ఆటోలకు క్యూ ఆర్‌ కోర్‌ తప్పనిసరిగా అంటించాలని కాశీ బుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.

అన్ని ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరి
ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లు అందిస్తున్న సీఐ సూర్యనారాయణ

పలాస, మే 30 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ పోలీసు సర్కిల్‌ పరిధిలో అన్ని ఆటోలకు క్యూ ఆర్‌ కోర్‌ తప్పనిసరిగా అంటించాలని కాశీ బుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌ స్టికర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 405 ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లు అంటించామన్నారు. రెండు, మూడు రోజుల్లో మిగిలిన ఆటోలకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ క్యూర్‌ఆర్‌కోడ్‌ వల్ల మొబైల్‌ ఫోన్‌లో స్కాన్‌ చేస్తే సంబంధిత ఆటో, డ్రైవర్‌ వివరాలు కనిపిస్తాయన్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నర్సింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

టెక్కలిలో నిరంతర నిఘా

టెక్కలి, మే 30(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో నిరంతర నిఘా కొనసాగుతుందని సీఐ ఎ. విజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం రాత్రి అంబేడ్కర్‌ జంక్షన్‌లో కనిపించిన యువతకు పలు సూచనలు చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వా లన్నారు. మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్‌ రైడ్‌, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. బెట్టింగ్‌లు, జూదం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:54 PM