రైతులకు ఖర్చు లేకుండా ధాన్యం కొనుగోలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:47 PM
Purchase of grain ‘రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశామ’ని జిల్లాపౌరసరఫరాలశాఖ డీఎం వేణుగోపాల్ తెలిపారు. సోమవారం నరసన్నపేట మార్కెట్ కమిటీ ఆవరణలో గిడ్డంగులను పరిశీలించారు.
మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకపోవడంతో జాప్యం
పౌరసరఫరాలశాఖ డీఎం వేణుగోపాలరావు
నరసన్నపేట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశామ’ని జిల్లాపౌరసరఫరాలశాఖ డీఎం వేణుగోపాల్ తెలిపారు. సోమవారం నరసన్నపేట మార్కెట్ కమిటీ ఆవరణలో గిడ్డంగులను పరిశీలించారు. ‘జిల్లాలో అధికారికంగా ధాన్యం కోనుగోలు ప్రారంభించిన తర్వాత పక్రియ వేగవంతంగా సాగుతుంది. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకపోవడంతో కోనుగోలు జాప్యమవుతోంది. 406 కేంద్రాల ద్వారా రైతులకు షెడ్యూల్ ఇస్తాం. ఈలింగ్, కళాసీల చార్జీల పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ’ని డీఎం తెలిపారు. మార్కెట్ కమిటీ ఆవరణలో గోదామలకు ఎఫ్‌సీ బియ్యం రాకపోవడంతో పనిలేకుండా పోతుందని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగుల కళాసీలు డీఎం వద్ద మొర పెట్టుకున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించడంతో ఏడాది పొడవునా ఉపాధి లేకుండా పోతుందని వాపోయారు.