Minister Bharath: సుపరిపాలనపై ప్రజల్లో సంతోషం
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:56 PM
Citizen feedback .. Effective administration కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ప్రాసెసింగ్‌శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం రణస్థలం మండలం కోష్టలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మంత్రి టీజీ భరత్
రణస్థలం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ప్రాసెసింగ్‌శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం రణస్థలం మండలం కోష్టలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి భరత్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోంది. కోష్టలో ఆదరణ చూస్తే.. కూటమి పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తోంది. ఏడాదిలో అన్ని శాఖల్లో కలిపి రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నాలుగేళ్లలో భారీస్థాయిలో పెట్టుబడులు రానున్నాయి. మా ప్రభుత్వం మరో రెండు దశాబ్దాలపాటు అధికారంలో ఉండాలి. అప్పుడే ఏపీ దేశంలో ఉత్తమ రాష్ట్రం అవుతుంద’ని తెలిపారు. ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తోందన్నారు. గ్రామాల్లో ప్రజలను నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, పిషిని జగన్నాథంనాయుడు, ముప్పిడి సురేష్, చౌదరి బాబ్జి, కలిశెట్టి సూర్యనారాయణ, పిన్నింటి భానోజినాయుడు, లంక శ్యామలరావు, వడ్డాది శ్రీను, ముక్కు ఆదినారాయణ పాల్గొన్నారు.