Share News

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం తగదు

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:10 AM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం తగదని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం సమీపంలో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి స్థలాన్ని సోమవారం పరిశీలించారు.

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం తగదు
నిర్మాత నారాయణమూర్తితో ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం తగదని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం సమీపంలో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పట్టణం లో దూరంగా ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూటమి ప్రభు త్వం చర్యలు తీసుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.5.50 కోట్లు మంజూరైనట్లు ప్రకటించి ఎటువంటి పనులు చేపట్టక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర వైద్యశాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణం గత ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసి కొత్తగా నిధుల మంజూరు ఉత్తర్వులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పనితీరు మెరుగు పర చుకోవాలని వైద్యశాఖ, మునిసిపల్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను హెచ్చరించారు.

సందేశాత్మక చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ

పొందూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సందేశాత్మక చిత్రాలకు ప్రజల నుంచి ఎప్పుడూ చక్కని ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. పొందూరు కేవీఆర్‌ థియేటర్‌లో చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తితో కలిసి యూనివర్శిటీ పేపర్‌లీక్‌ చిత్రాన్ని సోమ వారం ఆయన తిలకించారు. విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకతను చిత్రం లో చక్కగా చూపించారని ప్రశంసించారు. దర్శకుడు నారా యణమూర్తి మాట్లాడుతూ.. విద్య, వైద్యం అనేవి ప్రభుత్వం సేవలుగా గుర్తించి ఉచితంగా అందిం చాలని అయితే ప్రస్తుతం ఇవి వ్యాపారంగా మారిపోవడం దురదృష్టకరమన్నారు. వీరితో పాటు పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:10 AM