Share News

ప్రజా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:43 PM

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం విచా రణ చేసి పూర్తిస్థాయిలో పరిష్క రించాలని, నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశిం చారు.

ప్రజా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం విచా రణ చేసి పూర్తిస్థాయిలో పరిష్క రించాలని, నిర్లక్ష్యం వహించవద్దని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశిం చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదుల స్వీక రణ, పరిష్కార వేదికను నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 44 మంది నుంచి వినతులు స్వీకరించి వారితో స్వయంగా మా ట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫి ర్యాదుదారు సంతృప్తి చెందేలా చర్యలు చేప ట్టాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులతో మా ట్లాడి భరోసా కల్పించారు. మొత్తం 44 ఫిర్యా దులు రాగా వాటిలో కుటుంబ సమ స్యలు, తగాదాలు, మోసపూరితమైనవి, ఆస్తి తగా దాలు, సివిల్‌, ఇతర అంశాలపై వినతులు వచ్చినట్లు డీపీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Updated Date - Sep 29 , 2025 | 11:43 PM