Share News

ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎస్పీ

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:07 AM

ప్రజా ఫిర్యాదు లకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశిం చారు.

ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎస్పీ
వినతులను పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): ప్రజా ఫిర్యాదు లకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశిం చారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదికను నిర్వహించి పలు ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది నుంచి వినతులు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యల ను తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోస పూరి తమైన, ఆస్తి తగాదాలు, కొట్లాటలపై ఫిర్యాదులు స్వీకరించారు.

Updated Date - Sep 23 , 2025 | 12:07 AM