ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:26 PM
: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరి ష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరి ష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశిం చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యా లయంలో ప్రజా ఫిర్యా దుల స్వీకరణ, పరి ష్కార వేదికను నిర్వహించారు. ఆయన వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 53 మంది ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడారు. తక్షణం ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసు కోవాలని ఆయా స్టేషన్ అధికారులకు ఆదేశించారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోస పూరిత, ఆస్తి తగాదాలు, కొట్లాట, ఇతర సమస్యలపై 53 ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు.