అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించండి
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:14 AM
ప్రజా ఫిర్యాదుల నమోదు ప రిష్కారంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల నమోదు ప రిష్కారంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చినవారి నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్ పద్మావతి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- తమ ఇంటి స్థలాన్ని గ్రామానికి చెందిన పెత్తం దారు ఆక్రమించి బెదిరిస్తున్నాడని జలుమూరు మండ లం టెక్కలపాడు గ్రామానికి చెందిన దివ్వలస వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు సోమ వారం గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌ను కలిసి తన సమ స్యను వివరించి వినతిపత్రం అందజేశాడు. తన ఇంటి స్థలాన్ని గ్రామ అగ్రకుల పెత్తందారురు ఆక్రమిం చుకున్నారని, ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు తెలియజేసినా ఫలితం లేకపోయిందని, గత ఆరు నెలలుగా సమస్యను పరిష్కరించడం లేదన్నాడు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
- సోంపేట మండలం గొల్లఊరు పంచాయతీకి చెందిన కవిరాజు గ్రీవెన్స్‌లో జేసీని కలిసి వినతి పత్రం అందజేశారు. మామిడిపల్లి గ్రామానికి చెందిన డొక్కా సీతమ్మ ఈ ఏడది ఏప్రిల్‌లో మరణించిందని, ఆమెకు భర్త, పిల్లలు లేరు. దీంతో ఆమె సోదరుడు మడ్డు ఉమాపతి మామిడిపల్లి సచివాలయంలో మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడని, కానీ ఇంతవరకు సచివాలయ కార్యదర్శి సరైన కారణం తెలుపకుండా పత్రం మంజూరు చేయలేదని, దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని జేసీని వేడుకున్నారు.