Share News

బాలలకు పౌష్టికాహారం అందించండి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:32 PM

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఎమ్యెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఎంపికైన సిబ్బంది అంకితభావంతోపనిచేసి భావితరాలకు ఆదర్శంగా ఉండాలని కోరారు.

 బాలలకు పౌష్టికాహారం అందించండి: ఎమ్మెల్యే
అంగన్‌వాడీ సహాయకురాలికి నియామకపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే :

ఎల్‌.ఎన్‌.పేట, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఎమ్యెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఎంపికైన సిబ్బంది అంకితభావంతోపనిచేసి భావితరాలకు ఆదర్శంగా ఉండాలని కోరారు.మంగళవారం ఎల్‌.ఎన్‌.పేటమండలంలోని బొత్తాడసింగి పంచాయతీ పరిధిలోని పూశాం అంగన్‌వాడీకేంద్రం సహాయకురాలిగా ఎంపికైన కె.జ్యోతికి పాత పట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొత్తూరు డివిజన్‌ ఐసీడీఎస్‌ సీడీపీవో వి.ఉమాజానకి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బాబుకిషోర్‌, ఎ.పోలినాయుడు, కె.తిరుపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:32 PM