Share News

మెటర్నటీ వార్డుకు నిధులు ఇవ్వండి

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:37 PM

నరసన్నపేట సామాజిక ఆసుపత్రి మెటర్నటీ వార్డు పనులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.

మెటర్నటీ వార్డుకు నిధులు ఇవ్వండి
చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న బగ్గు రమణమూర్తి :

నరసన్నపేట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట సామాజిక ఆసుపత్రి మెటర్నటీ వార్డు పనులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.ఈ మేరకు అమరా వతిలోని సీఎంవో కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగాక్రీడా వికాస కేంద్రం పనులు పూర్తి చేసి విద్యుదీకరణ చేపట్టాలని, రాజులు చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడానికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈమేరకు చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారని, ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తిచేసేందుకు నిధులు మంజూ రుకు హామీఇచ్చారని రమణమూర్తి తెలిపారు.

Updated Date - Apr 10 , 2025 | 11:37 PM