బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వండి
ABN , Publish Date - May 18 , 2025 | 11:57 PM
బాధిత కుటుంబానికి ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు కోరారు.రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కంచిలి, మే 18 (ఆంధ్రజ్యోతి): బాధిత కుటుంబానికి ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు కోరారు.రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.మండలంలోని పెద్దకొజ్జిరియాకు చెందిన కౌలు రైతు బల్లెడ నర్సింహమూర్తి ఇటీవల ఆత్మహత్యచేసుకోవడంతో రాష్ట్ర మానవ హక్కులవేదిక, రైతు స్వరాజ్య వేదికసభ్యులు వీఎస్‌కృష్ణ, కె.ప్రధాన్, తామాడ అరుణ, బాలు గోడి, కేవీ జగన్నాఽథం, బీసీహక్కుల ప్రతినిధి బీన ఢిల్లీరావు ఆయన రైతుకుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఇంతవరకు ప్రభుత్వం కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయకపోవడంపై ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంత రైతాంగానికి ప్రభుత్వాలు బాసటగా నిలవాలన్నారు.ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే, వెంటనే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, నివేదికను కలెక్టర్‌కు పంపించాల్సి ఉందన్నారు. కానీ నర్సింహమూర్తి మృతిచెంది40 రోజులు గడిచినా జిల్లాకు చెందిన మంత్రి త్రిసభ్య కమిటీని ఎందుకు వేయలేదన్నారు.2020లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 43 ప్రకారం రైతు ఆత్మహత్య చేసుకుంటే, బాధిత కుటుంబానికి ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలన్నారు.