రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:12 AM
ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు.
-ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్
కొత్తూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. మంగళవారం కొత్తూరు సామాజిక ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలను పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో తగినంతగా వసతి, బెడ్స్ లేవని రోగులు పీవో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన స్పందిస్తూ కొత్త భవనం ప్రారంభమయ్యే వరకు రోగులు సహకరించాలని కోరారు. విధుల్లో ఒక్క వైద్యుడే ఉండటంతో మిగిలిన వైద్యులు, సిబ్బంది ఎక్కడికి వెళ్లారని ఆరా తీశారు. రోగులకు సకాలంలో మెరుగైన సేవలు అందించాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి ఆవరణలో నూత నంగా నిర్మిస్తున్న భవనం పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా లోపం లేకుండా ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
ప్రైవేటు వైద్యునికి మందలింపు
అంతకుముందు కొత్తూరులో ఉన్న ప్రయివేటు ఆసుపత్రులను పరిశీలించారు. ఇటీవల కాలంలో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఒకరు మృతి చెందడం.. మరో విద్యార్థినికి సకాలంలో వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల మృ తి చెందిన సంఘటనల నేపథ్యంలో పీవో స్వయంగా ఆస్పత్రులను పరిశీలించారు. ప్రయివేటు వైద్యుడు నాగేశ్వరావును మందలించారు. ఎటువంటి అర్హతలు లేకుండా వైద్య అందించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇక నుంచి ప్రథమ చికిత్స వరకే పరిమితం కావాలి తప్ప.. వైద్యం చేసేందుకు ప్రయత్నిస్తే క్రిమి నల్ కేసులు నమోదుకు ఆదేశిస్తామని హెచ్చరించారు. పీవో పరిశీలిస్తున్నారని తెలియడంతో మిగిలిన ప్రయివే టు ఆసుపత్రులు, ల్యాబ్‌ల సిబ్బంది కనిపించకుండా పోయారు. పీవోతో పాటు ఇన్‌చార్జి తహసీల్దార్ సీహెచ్ భీమారావు, కురిగాం ఆసుపత్రి వైద్యాధికారి పెద్దిన ప్రసన్న కుమార్, ఈఈ రమాదేవి, డీఈ సిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ఫమెట్టూరు ఆసుపత్రి సమ స్యలను పీవోకు వివరించినట్టు నిర్వాసితుల సంఘ అధ్యక్షులు బూర్లె శ్రీనివాసరావు తెలిపారు. స్థల వివా దంతో అక్కడ ఆసుపత్రి భవన నిర్మాణం నిలిచిపో యిందని... దీనితో పంచాయతీ కార్యాలయంలో సిబ్బం ది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పీవో స్పంది స్తూ.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.