భూసేకరణపై పూర్తి నివేదిక అందించండి: జేసీ
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:44 PM
శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో ఊసవానిపేట రైల్వేగేటు ప్రాంతంలో నిర్మాణం చేపట్టనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన భూసేకరణ చేసి పూర్తి నివేదికను అందించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు.
ఆమదాలవలస, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపం లో ఊసవానిపేట రైల్వేగేటు ప్రాంతంలో నిర్మాణం చేపట్టనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన భూసేకరణ చేసి పూర్తి నివేదికను అందించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సదరు ప్రాంతాన్ని పరిశీలిం చారు. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు చేపట్టిన భూసేకరణ అలైన్‌మెంట్‌ను జేసీ పరిశీలించి ఆ వివరాలను తహసీల్దార్ రాంబాబును అడిగి తెలుసు కున్నారు. రెవెన్యూ, రైల్వే సర్వే అధికారులు పాల్గొన్నారు.