మిన్నంటిన నిరసనలు
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:05 AM
రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా డిబేట్ పెట్టిన సాక్షి చానెల్‌ను తక్షణమే బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

రాజధాని మహిళలను కించపరచడంపై ఆందోళనలు
జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు
రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా డిబేట్ పెట్టిన సాక్షి చానెల్‌ను తక్షణమే బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఆమదాలవలస, జూన్ 10(ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేసి, చానెల్ బ్యాన్ చేయాలని మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీత డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, సీనియర్ న్యాయవాది కణితి విజయలక్ష్మీ బాయి, ఎన్ని శ్రీదేవి, సిమ్మ మాధవి, బోయిన సునీత, గుడ్ల రాజ్యలక్ష్మి, కూన వెంకట రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం నుంచి ప్రధాన రహదారిలో ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ బాలరాజుకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణనాయుడు, పార్టీ నాయకులు మొదలవలస రమేష్, తమ్మినేని విద్యాసాగర్, తాడేల రాజారావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
మానవ సమాజానికే సిగ్గుచేటు
అరసవల్లి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై సాక్షి టీవీలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు, యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు మానవ సమాజానికే సిగ్గుచేటని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతీశంకర్ విమర్శించారు. ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం స్థానిక సూర్యమహల్ కూడలి నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకు మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు రెడ్డి గిరిజాశంకర్, శవ్వాన ఉమామహేశ్వరి, కవ్వాడి సుశీల, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
గళమెత్తిన మహిళాలోకం
పొందూరు, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై సాక్షి చానెల్‌లో అనుచితవాఖ్యలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు గళమెత్తారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రం పొందురులో అనలిస్ట్ ముసుగులో ఉన్న వైసీపీ సైకో కృష్ణంరాజు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీలో మహిళలకు గౌరవంలేదని మరోసారి రుజువైందని సర్పంచ్ రేగిడి లక్ష్మి అన్నారు. నా అక్కచెల్లెల్లు, అమ్మలు అని కపటప్రేమను కురిపించే జగన్‌రెడ్డి తన చానెల్‌లో మహిళలను వేశ్యలంటూ దుర్భాషలాడితే ఎందుకు స్పందించలేదని ఎంపీటీసీ ఎ.వాణి, మాజీ సర్పంచ్ ఎ.విజయలక్ష్మి, టీడీపీ నాయకులు బలగ రాధాకుమారి ప్రశ్నించారు. ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినవారిపైనా, దీనికి వేదికైన సాక్షి చానెల్ యాజమాన్యంపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో, తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో వైసీపీకి చెందినవారు తప్ప.. అన్ని పార్టీలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
పాతపట్నంలో నిరసన
పాతపట్నం, జూన్ 10(ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలను కించపరిచిన వ్యక్తులు, ప్రసారం చేసిన సాక్షి చానల్‌పై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పాతపట్నంలో భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆల్ ఆంధ్రా రోడ్డు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. సాక్షి పత్రి కలను దహనం చేశారు. సాక్షి చానల్‌లో ప్రసారం చేసిన డిబేట్‌లో మహిళల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్య లు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళలతో పాటు బీజేపీ, జనసేన మహిళా నేతలు పాల్గొన్నారు.
అనుచిత వ్యాఖ్యలు దారుణం
పలాస, జూన్ 10(ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కేఎస్‌ఆర్‌తో పాటు సాక్షి మీడియాపై చ ర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలాస టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం మా నవహారం నిర్వహించారు. సాక్షి దినపత్రికలను దహ నం చేసి నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా ని యోజకవర్గ పార్టీ సమన్వ యకర్త యార్లగడ్డ వెంక న్నచౌదరి, ఏపీటీపీసీ చై ర్మన్ వజ్జ బాబూరావు, టీ డీపీ జిల్లా ప్రధాన కార్యద ర్శి పీరుకట్ల విఠల్‌రావు మాట్లాడుతూ.. అమరావ తిని రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి సాక్షి పత్రిక, చానల్ విషం చిమ్ముతూనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లొడ గల కామేశ్వరరావు యాదవ్, నేతలు గాలి కృష్ణారావు, టంకాల రవిశంకర్‌గుప్తా, బడ్డ నాగరాజు, గురిటి సూ ర్యనారాయణ, సప్ప నవీన్, దువ్వాడ శ్రీకాంత్, ఎం.న రేంద్ర, ఎ.రామకృష్ణ, కొత్త సత్యం, సూరాడ మోహ నరావు, రట్టి లింగరాజు, పైల చక్రధర్, పలువురు తెలుగు మహిళలు పాల్గొన్నారు.