Share News

గ్రీవెన్స్‌ హాల్‌లో ప్లకార్డులతో నిరసన

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:08 AM

జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహి స్తున్న గ్రీవెన్స్‌ హాల్‌లోకి వైసీపీ నేత లు ప్లకార్డులతో రావడంపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

గ్రీవెన్స్‌ హాల్‌లో ప్లకార్డులతో నిరసన
గ్రీవెన్స్‌లోకి ప్లకార్డులతో వెళ్లిన వైసీపీ నాయకులు

ఇది సరికాదంటూ వైసీపీ నేతలపై కలెక్టర్‌ ఆగ్రహం

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహి స్తున్న గ్రీవెన్స్‌ హాల్‌లోకి వైసీపీ నేత లు ప్లకార్డులతో రావడంపై కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పొందూరు మండలం లో ఎరువుల పంపిణీలో రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ఆ మండ లానికి చెందిన వైసీపీ నేతలు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం వచ్చారు. నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో హాలులోకి వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకా ర్డులతో ఎలా వస్తారని, ఇది సరైన విధానం కాదని, నిరసన తెలపాలంటే బయట చేసుకోవా లని ఆగ్రహం చెందారు. దీంతో వైసీపీ నాయకులు బిత్తరపోయారు. ఇటు వంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికా రులను కలెక్టర్‌ ఆదేశించారు.

యూరియా కోసం లారీని చుట్టుముటిన రైతులు

పొందూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): యూరియా పంపిణీలో అధికారుల తీరు పై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటాయింపులు, వస్తున్న యూరియాలో పెద్ద ఎత్తున వ్యత్యాసాలుండడంతో వారు ఆవేదనకు గురవు తున్నారు. మలకాం (జాడపేట)కి ఇంత వరకు కేవలం 20 టన్నులు యూరి యాను మాత్రమే కేటాయించారు. సోమవారం 15 టన్నులు కేటాయించినట్లు వ్యవసాయాధికారుల నుంచి గ్రామస్థులకు సమాచారం వచ్చింది. ఇప్పటికే యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులు కేవలం 5 టన్నులతో లారీ రావడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సర్పంచ్‌ జాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా రైతులు లారీని చుట్టుము ట్టారు. మా గ్రామా నికి కేటాయించిన 15 టన్నులు రాకపోతే లారీని వదిలేది లేదని స్పష్టం చేశారు. దీనిపై ఏవో శ్రీనివాసరావును వారు ప్రశ్నించగా 15 టన్నులు కేటాయిం చడం వాస్తవమని, కాని 5 టన్నులు పంపినట్లు యూరియా కేటా యింపు అధికారుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. మాకు కేటాయిం చిన యూరియాను జిల్లాకు చెందిన ఒక కీలక అధికార పార్టీ నాయకుడు తన నియోజకవర్గానికి తరలించికుపోయారని రైతులు ఆరోపించారు.

Updated Date - Sep 23 , 2025 | 12:08 AM