Share News

పాఠశాలను తరలించొద్దంటూ ధర్నా

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:52 PM

తమ పాఠశాలలో 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలకు తరలించొద్దంటూ నందివాడ పంచాయతీ భగవాన్‌దాస్‌పేట పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు.

పాఠశాలను తరలించొద్దంటూ ధర్నా
ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్థులు

పొందూరు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): తమ పాఠశాలలో 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలకు తరలించొద్దంటూ నందివాడ పంచాయతీ భగవాన్‌దాస్‌పేట పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంతో భగవాన్‌దాస్‌పేట పాఠశాలలో 3, 4, 5 తరగతులను నరసాపురం ఆదర్శ ప్రాఽథమిక పాఠశాలల్లో విలీనం చేశారు. తరగతులను తరలించొద్దంటూ గతంలో గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవోకు వినతిపత్రం అందించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో హెచ్‌ఎం రమేష్‌ పాఠశాలలో ఉండగా తమ పిల్లలతో తల్లిదండ్రులు నినాదాలు చేస్తూ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.

Updated Date - Jun 30 , 2025 | 11:52 PM