Share News

మృతుడి బంధువుల నిరసన

ABN , Publish Date - May 15 , 2025 | 11:24 PM

శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్‌ ఆసుప త్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కొండ్రు త్రినాఽథరావు(32) మృతి చెందగా గురువారం కూడా బంధువులు ఆస్పత్రి వద్ద నిరసన తెలిపా రు.

మృతుడి బంధువుల నిరసన
పోలీసులతో వాగ్వాదానికి దిగిన త్రినాథరావు బంధువులు

శ్రీకాకుళం క్రైం, మే 15(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్‌ ఆసుప త్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కొండ్రు త్రినాఽథరావు(32) మృతి చెందగా గురువారం కూడా బంధువులు ఆస్పత్రి వద్ద నిరసన తెలిపా రు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే త్రినాథరావు మృతి చెందాడని బంధువులు ఆరోి పంచారు. గురువారం పెద్దఎత్తున గ్రామస్థులతో కలిసి ఆసుపత్రికి చేరుకుని నిరసన తెలిపారు. త్రినాఽథరావు చనిపోయి రెండు రోజులైనా ట్రీట్‌మెంట్‌ చేశా రని, సుమారు రూ.నాలుగు లక్షలు వైద్యం కోసం వసూలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిం చినా.. వినకుండా పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అయితే ఎప్పటికీ ఆసు పత్రి యాజమాన్యం,వైద్యులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం ఎస్పీ మహే శ్వరరెడ్డి వద్దకు వెళ్లి ఫిర్యాదుచేశారు. విచారణచేస్తామని ఎస్పీ హామీ ఇవ్వడం తో త్రినాథరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

Updated Date - May 15 , 2025 | 11:24 PM