Share News

ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా నిరసన

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:47 PM

మందస మండలంలోని రాంపురం గ్రామ సచివాలయం వద్ద కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకే వ్యతిరేకంగా బాధిత రైతులు సోమ వారం నిరసన తెలిపారు.

  ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా నిరసన
రాంపురం సచివాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న రైతులు:

హరిపురం, జూలై7 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలోని రాంపురం గ్రామ సచివాలయం వద్ద కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకే వ్యతిరేకంగా బాధిత రైతులు సోమ వారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ఎం. శ్రీకాంత్‌, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ సిబ్బందితోకలిసి రాంపురం, బిడిమి, గంగువాడ గ్రామా లను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా ఎటువంటి ఆం దోళనలు చేపట్టవద్దని, నిరసన కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తప్పనిసరని తెలి పారు. కార్యక్రమంలో డీటీ రామకృష్ణ, ఆర్‌ఐ చిన్నారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:47 PM