పాఠశాల స్థలం ఆక్రమణపై నిరసన
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:53 PM
కడు ము కాలనీ పా ఠశాల ఆవరణ లో కొంతమంది అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేస్తు న్నారని ఆ గ్రా మానికి చెందిన కొంతమంది నిరసన తెలిపారు.
కొత్తూరు, సె ప్టెంబరు 27(ఆం ధ్రజ్యోతి): కడు ము కాలనీ పా ఠశాల ఆవరణ లో కొంతమంది అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేస్తు న్నారని ఆ గ్రా మానికి చెందిన కొంతమంది నిరసన తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాల ఎదుట ఆందో ళన కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఆవరణలో ఇల్లు నిర్మాణానికి స్లాబ్ వే సేందుకు స్థానికులు ఒకరు సమాయత్తం అవుతుండగా స్థానికులు అడ్డుకోవ డంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్‌ఐలు సీహెచ్ ప్రసాద్, ఎండీ అమీర్ ఆలీ ఇరువర్గాలతో మాట్లాడి సర్ధి చెప్పారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తే భవిష్య త్తులో ఇబ్బందులు ఉండవని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.