కార్మికుల తొలగింపుపై నిరసన
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:58 PM
పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ కెమికల్ పరిశ్రమలో పనిచేస్తున్న 11 మంది కార్మికులను తొలగించడంపై ఆ పరిశ్రమ లో పనిచేస్తున్న కార్మికులంతా మంగళవారం నిరసన తెలిపారు.
రణస్థలం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ కెమికల్ పరిశ్రమలో పనిచేస్తున్న 11 మంది కార్మికులను తొలగించడంపై ఆ పరిశ్రమ లో పనిచేస్తున్న కార్మికులంతా మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు వురు కార్మికులు మాట్లాడుతూ.. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొల గించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నఫలంగా తీసేయడంతో తామం తా వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే పరిశ్రమ నష్టాల్లో ఉంద ని యాజమాన్యం చెబుతుందన్నారు. ఈ విషయమైన పరిశ్రమ యజమాని బి.లక్ష్మణ రావు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల పరిశ్రమ నష్టాల్లో ఉందని, అందువల్ల ఏడుగురు కార్మికులను తొలంచినట్టు తెలిపారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ అజయ్ కార్తికేయ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. అక్కడి పరిస్థితి పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. యాజమాన్యాలు కార్మిక చట్టాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా ఐదేళ్ల కిందట ఏర్పాటైన ఈ పరిశ్రమలో 70 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.