పోరాటాలతోనే హక్కుల రక్షణ
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:31 PM
పోరాటాలతోనే హక్కులు రక్షించుకోవచ్చని ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.ఆదివారం శ్రీకాకుళంలోని డైమండ్ పార్కు నుంచి ఏడురోడ్ల కూడలి వద్ద గల ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్ వరకు ఏఐటీయూసీ జిల్లా 15వ మహాసభలు పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు.
అరసవల్లి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పోరాటాలతోనే హక్కులు రక్షించుకోవచ్చని ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.ఆదివారం శ్రీకాకుళంలోని డైమండ్ పార్కు నుంచి ఏడురోడ్ల కూడలి వద్ద గల ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్ వరకు ఏఐటీయూసీ జిల్లా 15వ మహాసభలు పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఉత్తమ పరిశ్రమల స్థాపనకు కార్మికుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. మహాసభలో రాష్ట్ర కార్యదర్శి పడాలరమణ, నాయకులు టి.తిరుపతిరావు, టి.ముత్యాలరావు, డి.కిరణ్, వై.సూర్యనారాయణ, బి.అప్పలరాజు, లబ్బరాజు, కె.అప్పలరాజు, సునీత పాల్గొన్నారు.