Share News

భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించండి

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:49 PM

భారత రాజ్యాంగ విలు వలను పరిరక్షించిన నాడే బహుజనులకు న్యాయం జరుగుతుందని రిటైర్డ్‌ డీజీపీ, ఆల్‌ఇండియాబహుజన పార్టీ నేషనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.పూర్ణ చంద్రరావు అన్నారు.

భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించండి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న రిటైర్డ్‌ డీజీపీ పూర్ణచంద్రరావు తదితరులు

శ్రీకాకుళం లీగల్‌ అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ విలు వలను పరిరక్షించిన నాడే బహుజనులకు న్యాయం జరుగుతుందని రిటైర్డ్‌ డీజీపీ, ఆల్‌ఇండియాబహుజన పార్టీ నేషనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.పూర్ణ చంద్రరావు అన్నారు. స్థానికంగా ఓ హోటల్‌లో శనివారం పార్టీ ఆధ్వ ర్యంలో సదస్సు నిర్వహించారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చిన నాడే అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఈనెల 9న భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ విజయవాడలో ధర్నా నిర్వహిస్తు న్నామన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే లకె రాజారావు, డాక్టర్‌ పీబీ కామేశ్వరరావు, జిల్లా దళిత సంఘ నాయకులు కంఠ వేణు, కళ్లేపల్లి రాంగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:49 PM