ప్రాపర్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:14 PM
దీర్ఘకాలికంగా దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ నేరాలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు ఆదేశిం చారు.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ నేరాలను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు ఆదేశిం చారు. నవంబరు, డిసెంబరు నెలలకు సంబం ధించిన నెలవారీ నేర సమీక్ష సమావేశం శని వారం జిల్లా పోలీసు కార్యాల యంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నేరాల స్థితిగతులు, శాంతిభద్రతలు, విజిటబుల్ పోలీ సింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పనితీరు తదితర అంశా లపై సమీక్షించారు. డయల్ 112 కాల్స్‌పై స్పందన సమయాన్ని మరింత మెరుగు పర్చా లని, ప్రజా ఫిర్యాదులను చట్ట పరిధిలో శాశ్వ తంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రంకింగ్‌లను నివారించేం దుకు స్పెషల్ డ్రెవ్ చేపట్టాలన్నారు. సంక్రాంతి, రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్ర మత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డి. లక్ష్మణరావు, షేక్ సహాబాజ్ అహ్మద్, గోవింద రావు, ఏవో గోపీనాథ్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన కాశీబుగ్గ డీఎస్పీ
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన షేక్ షాహాబాజ్ అహ్మద్ శనివారం ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి పూలమొక్కను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అభినందిస్తూ.. సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణ, శాంతిభ ద్రతల పరిరక్షణ, విజిబుల్ పోలీసింగ్, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్, గంజాయి రవాణా నిషేధం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.