ముక్కోటి ఏకాదశికి పక్కా ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:52 PM
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30న పట్టుమహాదేవి కోనేరు గట్టుపై గల వైభవ వేంకటేశ్వరస్వామి ఆల యానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేయాలని పోలీసు లకు, నిర్వాహకులకు మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సూచించారు.
భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యం
మంత్రి అచ్చెన్నాయుడు
వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలన
టెక్కలి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30న పట్టుమహాదేవి కోనేరు గట్టుపై గల వైభవ వేంకటేశ్వరస్వామి ఆల యానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేయాలని పోలీసు లకు, నిర్వాహకులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. శనివారం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి భక్తుల దర్శనానికి అవసర మైన ఏర్పాట్లు, బారికేడ్లు, క్యూలైన్ల ఏర్పాటు, ట్రా ఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచ నలు చేశారు. భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎటువంటి త ప్పిదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అనం తరం అన్నక్యాంటీన్ నిర్మాణం పనులు, పట్టుమహాదేవి కోనేరు గట్టు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీ లించారు. ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరి, నాయకులు పినకాన అజయ్‌కుమార్, పోలాకి చంద్రశేఖర్, హనుమంతు రా మకృష్ణ, లవకుమార్, మామిడి రాము, సుం దరమ్మ తదితరులు ఉన్నారు.
సబ్ కలెక్టరేట్‌లో ప్రజా దర్బార్
టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాదర్బార్ నిర్వహించా రు. నియోజకవర్గ పరిధిలో నలుమూలల నుంచి పెద్దఎత్తున అర్జీలతో వచ్చినవారి నుంచి వినతులు మంత్రి స్వీకరించారు. ఇలా వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి అక్కడికక్కడే కొన్నిం టిని పరిష్కరించగా.. మరికొన్నింటిని పరిష్కరిం చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరి, పినకాన అజ య్‌కుమార్, పోలాకి చంద్రశేఖర్, హనుమంతు రామకృష్ణ, లవకుమార్, మామిడి రాము, సుంద రమ్మ తదితరులు పాల్గొన్నారు.