పదోన్నతులు కల్పించాలి
ABN , Publish Date - May 18 , 2025 | 11:55 PM
సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని మునిసిపల్ ఇంజినీరింగ్‌వర్కర్స్‌యూనియన్ గౌరవాధ్యక్షుడు తిరు పతిరావు కోరారు.సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ చేస్తున్న సమ్మె ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది.
శ్రీకాకుళం అర్బన్, మే 18(ఆంధ్రజ్యోతి): సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని మునిసిపల్ ఇంజినీరింగ్‌వర్కర్స్‌యూనియన్ గౌరవాధ్యక్షుడు తిరు పతిరావు కోరారు.సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ చేస్తున్న సమ్మె ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీకాకు ళం నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమ్మె శిబిరంలో తిరుప తిరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ రూ.29,200లు, నాన్ టెక్నికల్ రూ.24,500లు ఇవ్వాలనిదీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్యామలరావు, ఆర్.సతీష్, శంకరరావు, ముఖేష్ యాదవ్, జై కిషోర్, మజ్జి.శ్రీను, సతీష్, రాఘవ, శశి, గోవిందరాజు, త్రినాథ, వెంకట్, రూప, రమేష్‌బాబు, సాగర్, చంద్రశేఖర్, మెంటాడ.శేఖర్ పాల్గొన్నారు.