పారిశ్రామిక అభివృద్ధితో ప్రగతి
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:30 PM
పారిశ్రామిక అభివృద్ధితోనే ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక అభివృద్ధితోనే ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల అదనపు భవనాల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. కళాశాలలో మళ్లీ సైన్స్ గ్రూపుల మంజూ రుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమ కావా లని సీఎంని కోరానని, థర్మల్ పవర్ ప్లాంట్ మంజూరుకు హామీ ఇచ్చారన్నారు. అయితే కొందరు అవగాహన లేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పవర్ ప్లాంట్ వల్ల దానికి అనుబంధంగా సిమెంట్ తదితర పరిశ్రమలు ఏర్పాటై పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.ఎస్.ఎన్ స్వామి, మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి, మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీతా సాగర్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, పీఏసీఎస్ అధ్యక్షురాలు సిమ్మ మాధవి, ఎన్‌టీఆర్ వర్శిటీ డైరెక్టర్ చాపర సుధాకర్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, టీడీపీ నేతలు, అధ్యాపకులు పాల్గొన్నారు.