Share News

రైతులకు మేలు కలిగే కార్యక్రమాలు చేపట్టాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:11 AM

పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు పాలకవర్గం చేపట్టాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచించారు.

రైతులకు మేలు కలిగే కార్యక్రమాలు చేపట్టాలి
మాట్లాడుతున్న పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు

  • పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

మెళియాపుట్టి, జూలై 30(ఆంధ్రజ్యోతి): పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు పాలకవర్గం చేపట్టాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచించారు. బుధవారం కొసమాల పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా సలాన మోహనరావు ప్రమాణ స్వీకారానికి హాజరై ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయ పెట్టుబడులకు వాడిన రుణాలు సకాలంలో చెల్లించి సోసైటీలను నిలబెట్టాలని కోరారు. కార్యక్రమంలో కొత్తూరు మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు లోతుగెడ్డ తులసీ వరప్రసాధరావు, టీడీపీ నాయకులు అగతముడి భైరాగినాయుడు, అగతముడి మాధవరావు, మాతల గాంఽధీ, దినకరావు, లక్ష్మీనారాయణ, అనపాన రాజశేఖర్‌ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:11 AM