రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:49 PM
రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వమని విజ యనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ‘
ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
జి.సిగడాం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వమని విజ యనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో నాటుబండ్లు, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ పెట్టు బడికి ఈ పఽథకం దోహదపడు తుందన్నారు. ఈ పథకంతో రైతులు ఎంతగానో సంతోషం గా ఉన్నారన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్‌కి సాగునీరందించే ఉద్దేశంతో మడ్డువలస, తోటపల్లి, నారాయణపురం కాలువాల్లో పూడికలు తీయించి రైతులకు సాగు నీరందంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. నేతన్న లకు ఉచిత విద్యుత్ అందించిన ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయా ణం కల్పించనుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, జిసిగడాం, లావేరు, రణస్థలం మండలాల టీడీపీ అధ్య క్షులు కుమరాపు రవికుమార్, ముప్పిడి సురేష్, లంక శ్యామలరావు, బీజేపీ మండల అధ్యక్షుడు పైల విష్ణు మూర్తి, నాయకులు టంకాల మౌళీశ్వరరావు, బోగాది అప్పలనాయుడు, పిసిని జగన్నాఽథం పాల్గొన్నారు.
మేనిఫెస్టో అమలు ఘనత సీఎందే: శంకర్
అరసవల్లి/గార రూరల్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్న దాత సుఖీభవ పఽథకం అమలు చేసి సీఎం చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అనిపించుకున్నారని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం గార నుంచి అరసవల్లి డీసీఎంఎస్ కార్యాలయం వరకు 200 ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో భాగంగా రూ.5వేలు, పీఎం కిసాన్ రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు సాయ మందించారన్నారు. ఎరువుల రాయితీపై అందించేందు కు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్ర మంలో టీడీపీ మం డల అధ్యక్షుడు లోపింటి రాధాకృష్ణారెడ్డి, పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, టీడీపీ నేతలు ఉంగటి వెంకటరమణ, అరవల రవీంద్ర, చిన్నారావు, మూకళ్ల శ్రీనివాస్, జ్యోతి భాస్కర్, రమణమూర్తి పాల్గొన్నారు.