రొట్టవలసలో రామకోటి గ్రంథాల ఊరేగింపు
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:01 AM
2
సరుబుజ్జిలి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):రొట్టవలస శ్రీరామానందా శ్రమంలో నిర్వహి స్తున్న శ్రీతారకరామ నామ మహాయజ్ఞంలో భాగంగా ఆదివారం రామకోటి ఊరే గింపు కార్యక్రమాన్నినిర్వహించారు. ఆశ్రమవ్యవస్థాపక గురుస్వామి తొత్తడి వెంకట రమణ ఆధ్వర్యంలో ఆనందాశ్రమంలో ప్రత్యేక స్తూపం ఏర్పాటుతోపాటు మహా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 23శ్రీరామ ప్రత్యేక భక్త బృందాల మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.