Share News

teacher transfers: ముగిసిన బదిలీల ప్రక్రియ

ABN , Publish Date - May 29 , 2025 | 11:43 PM

teacher transfers:జిల్లా ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-2 హెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది.

teacher transfers: ముగిసిన బదిలీల ప్రక్రియ

- 93మంది గ్రేడ్‌-2 హెచ్‌ఎంలకు స్థానచలనం

నరసన్నపేట, మే 29 (ఆంరఽధజ్యోతి): జిల్లా ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్‌-2 హెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఐదేళ్ల పాటు సర్వీసు పూర్తి చేసిన వారితో పాటు రిక్వస్టు బదిలీపై 121 మంది గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 93 మందికి స్థానచలనం కలిగింది. వీరంతా జూన్‌ 1 తేదీన కొత్తపాఠశాలల్లో చేరాల్సి ఉంది. కాగా, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి గ్రేడ్‌-2 పదోన్నతుల కౌన్సిలింగ్‌ గురువారం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. 82 పోస్టులకు గాను 1:2నిష్పత్తి ప్రాతిపదికన సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. ఉదయం 8 గంటలకే అభ్యర్థులు కౌన్సిలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, రాష్ట్రస్థాయిలో పదోన్నతుల కౌన్సిలింగ్‌పై సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో రాత్రి 7 గంటల వరకు ఉపాధ్యాయులు నిరీక్షించారు. ఆ తరువాత కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్‌లో 82 మంది గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా పదోన్నతిపై వెళ్లనున్నారు.

పీఎస్‌హెచ్‌ఎంల నియామకంపై సందిగ్దత

జిల్లాలో ఈఏడాది ఏర్పాటు చేస్తున్న మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో హెచ్‌ఎంల నియమాకంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎల్‌ఎఫ్‌హెచ్‌ఎంలుగా పనిచేసిన వారికి తొలుత ప్రాధాన్యత క్రమంలో పీఎస్‌హెచ్‌ఎంలుగా నియమించనున్నారు. అయితే, సర్‌ప్లస్‌గా ఉన్న ఎస్‌ఏలతో తొలుత ఈ పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ అధికారులు భావించారు. అయితే, సరప్లస్‌ ఎస్‌ఏలో తెలుగు, ఇంగ్లీషు, గణితం సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో ఏఏ సబ్జెక్టులు వారికి ప్రాధాన్యత ఇస్తారు అనేది మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అలాగే మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో పీఎస్‌హెచ్‌ఎంలు బదిలీల ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Updated Date - May 29 , 2025 | 11:43 PM