Share News

రేషన్‌ బియ్యం అందక ఇక్కట్లు

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:45 AM

మండలంలో అధికంగా రేషన్‌ షాపులకు బియ్యం రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 30వ తేదీలోపు ఎంఎస్‌ గోదాం నుంచి రేషన్‌ షాపులకు బియ్యం తరలించాల్సి ఉండగా ఈనెల మాత్రం 4వ తేదీ వచ్చినా తరలింపులు జరగలేదు.

రేషన్‌ బియ్యం అందక ఇక్కట్లు
సరుకులు లేక మూతవేసిన నరహరిపురం జీసీసీ డిపో

  • జీసీసీ డిపోలకు సరఫరాకాని వైనం

  • ఇబ్బందిపడుతున్న గిరిజనులు

టెక్కలి రూరల్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలో అధికంగా రేషన్‌ షాపులకు బియ్యం రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 30వ తేదీలోపు ఎంఎస్‌ గోదాం నుంచి రేషన్‌ షాపులకు బియ్యం తరలించాల్సి ఉండగా ఈనెల మాత్రం 7వ తేదీ వచ్చినా తరలింపులు జరగలేదు. దీంతో డిపోల వద్దకు రేషన్‌ కోసం లబ్ధిదారులు వచ్చి ఖాళీ చేతులతో వెనుదిరుగుతు న్నారు. ప్రభుత్వం ప్రతి నెలా 25 నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు, 1 నుంచి 15వ తేదీ వరకు ఇతరులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయినా ని త్యావసర సరుకులు తరలించకపోవడంతో డీలర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. సకాలంలో రేషన్‌ అందక దసరా పండగ రోజుల్లో కొంతమంది అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. మండలంలో అదికంగి జీడిపేట, నరహ రిపురం జీసీస డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరి ధిలో ఉన్న వారంతా గిరిజనులే. వీ రంతా ప్రభుత్వం ఇస్తున్న బియ్యం తినే బతుకు సాగిస్తున్నారు. అందువల్ల ఇప్పటికైన సంబంధిత అధి కారులు స్పందించి సకాలంలో రేషన్‌ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతు న్నారు. దీన్నిపై సీఎస్‌డీటీ కూమార్‌ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలు వల్ల సివిల్‌ సప్లై నుంచి మం డల గోదాములకు రేషన్‌ సరుకులు రాకపోవడం ఆలస్యం జరుగుతుంది. రెండు రోజుల్లో అన్ని డిపోలకు సరుకులు అందజేస్తాం.

Updated Date - Oct 08 , 2025 | 12:45 AM