Arasavalli: అరసవల్లిలో.. షరామామూలే
ABN , Publish Date - May 25 , 2025 | 11:33 PM
Arasavalli Ongoing issues అరసవల్లిలో ఆదిత్యాలయంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ఆదా యం సమకూరుతున్నా.. భక్తులకు కనీస సౌక ర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.
ఆలయంలో సమస్యలు యథాతథం
ఎండలోనే భక్తుల అవస్థలు
అపరిశుభ్రంగా ఆలయ పరిసరాలు
యథావిధిగా కొనసాగిన అక్రమ వసూళ్లు
అరసవల్లి, మే 25(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో ఆదిత్యాలయంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ఆదివారం ఆదిత్యుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. ఆదివారం ఒక్కరోజే స్వామికి రూ.12,29,751 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మ కం ద్వారా రూ.8,84,100, విరాళాల ద్వారా రూ. 81,496, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.2,64, 155 ఆదాయం వచ్చింది. కాగా.. ఇంత ఆదా యం సమకూరుతున్నా.. భక్తులకు కనీస సౌక ర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. ఇటీవల ఈవో భద్రాజీ కంటి శస్త్రచికిత్స నిమిత్తం 15 రోజుల సెలవుపై వెళ్లారు. విశాఖ పట్నం శ్రీకనకమహాలక్ష్మి ఆలయ ఈవో శోభారాణి డిప్యూటేషన్‌పై అరస వల్లిలో విధులు నిర్వర్తించారు. వైశాఖమాసం కావడంతో భక్తుల తాకిడి దృష్ట్యా సమస్యలను గుర్తించి ఆమె ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ప్రసా దాల పంపిణీ, టిక్కెట్ల విక్రయాలు, సిబ్బంది అక్రమ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి.. కట్టడి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పైనా ఆమె కఠినంగా వ్యవహరించా రు. కాగా.. పాత ఈవో మళ్లీ మూడురోజుల కిందట విధుల్లో చేరడంతో.. పరిస్థితులు షరా మామూలుగానే మారిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు యథావిధిగా ఇబ్బందులు ఎదురయ్యాయి. పారిశుధ్య నిర్వహణ అధ్వా నంగా మారింది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదా రాలు దర్శనమిచ్చా యి. మరోవైపు దిన సరి వేతన ఉద్యోగు లు, సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహ రించడంతో అవస్థలు తప్పలేదు. ఎప్పటిలా గానే ఆలయ దినసరి వేతన శానిటేషన్ ఉద్యోగి.. సోడా బండి అయితే రూ.200, ఐస్‌క్రీమ్ బండికి రూ.100, అలాగే మరుగుదొడ్ల వద్ద మనిషికి రూ.10 చొప్పున అక్రమ వ సూలు చేశారు. ప్రతీ ఆదివారం ఇలా వేలాది రూపాయల అక్రమ వసూళ్ల కు పాల్పడుతున్నా, ఆలయ అధికారు లు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎండలోనే క్యూలైన్లలో భక్తులు..
స్వామి ప్రత్యేక దర్శనానికి వచ్చే భక్తులు రూ.100 క్యూలైన్లలో ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. అలాగే కేశఖండన శాల వద్ద కూడా భక్తులు మధ్యాహ్నం 12-30 గంటల సమయంలో ఎండలోనే నిల్చున్నారు. దీనిపై ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గం అంతా యాచకులే ఉండడంతో భక్తులు అసహనానికి గురయ్యారు.
ఒకరి భోజనం ముగ్గురికి సర్దుబాటు..
స్వామి అన్నప్రసాదాలను భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరిస్తుంటారు. ఒక్కో భక్తుడికి రూ.50చొప్పున అన్నప్రసాదంపై ఖర్చు పెడుతుంటారు. కానీ ఆదివారం నాటి అన్నప్రసాదం వడ్డింపులో మాత్రం ప్లేటులో కనీస పరిమాణంలో కూడా ఆహార పదార్థాలు వడ్డించలేదు. ఒకరికి భోజనం ముగ్గురికి సర్దుబాటు చేసేలా వడ్డన జరిగింది. అన్నదాన వ్యవహారంలో నిత్యం వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆలయ అధికారులు దృష్టి సారించాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఈవో భద్రాజీ వద్ద ప్రస్తావించగా.. సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.