Share News

గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - May 26 , 2025 | 11:44 PM

మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న మా గ్రామాల్లో నెలకొన్న సమస్య లను పరిష్కరించాలని పొనుటూరు పంచా యతీ బంకిబంజరుగూడ, బంకిగూడ, బంకి మెట్టుగూడ గిరిజనులు డిమాండ్‌ చేశారు.

గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న గిరిజనులు

కొత్తూరు, మే 26(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న మా గ్రామాల్లో నెలకొన్న సమస్య లను పరిష్కరించాలని పొనుటూరు పంచా యతీ బంకిబంజరుగూడ, బంకిగూడ, బంకి మెట్టుగూడ గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం, ఆది వాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పిల్లా పాపలతో కలిసి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా చేశారు. ఇరవై ఏళ్ల కిందట ఒడిశా నుంచి వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని, ఆధార్‌, రేషన్‌, ఉపాఽధి జాబ్‌కార్డు, ఓటు కార్డులను ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే గ్రామాల్లో తాగునీరు, రోడ్డు సదు పాయం లేదని, పిల్లలకు చదువుకునేం దుకు పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు లేకపోవడం తో నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న పొనుటూరు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవే దన వ్యక్తంచేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ బాల కృష్ణకు అందించారు. ప్రభుత్వం దృష్టికి సమ స్యలను తీసుకువెళ్లి పరిష్కా రానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో ఆయా సంఘాల నేతలు ఎస్‌.ప్రసాద రావు, సవర కలోడియా, సవర జయరాజ్‌, సవర పవుల్లో, ఎరస్టో, సవర పంజూ, అమృతషో, దశమంతు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:44 PM