Share News

క్విజ్‌ పోటీ విజేతలకు బహుమతులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:50 PM

కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌పోటీల్లో బొరివంక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్ధులు విజేతగా నిలిచారు.

క్విజ్‌ పోటీ విజేతలకు బహుమతులు
విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్

కవిటి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌పోటీల్లో బొరివంక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్ధులు విజేతగా నిలిచారు. శుక్రవారం నిర్వహించిన క్విజ్‌ పోటీలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో గీతం హైస్కూల్‌ (హరిపురం) ద్వితీయ, జడ్పీహెచ్‌ఎస్‌ హరిపురం విద్యార్థులు తృతీయ స్థానం పొందారు. గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మె ల్యే బెందాళం అశోక్‌ షీల్డ్‌, నగదు బహుమతులు అంద జేశారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, చిన బాబు, ఎంఈవో ధనుంజయ మజ్జి, హెచ్‌ఎం సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:50 PM