Share News

నేడు ప్రైవేటు పాఠశాలల బంద్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:25 AM

కొంతమంది అధికారులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై స్పందిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు గురువారం బంద్‌ పాటిస్తున్నట్టు ఆ సంఘ నాయకులు తెలిపారు.

నేడు ప్రైవేటు పాఠశాలల బంద్‌
డీఈవోకు నోటీసును అందిస్తున్న దృశ్యం

  • అధికారుల ఏకపక్ష నిర్ణయాలు సరికాదు

అరసవల్లి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): కొంతమంది అధికారులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై స్పందిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని అన్‌-ఎయిడెడ్‌ పాఠశాలలు గురువారం బంద్‌ పాటిస్తున్నట్టు ఆ సంఘ నాయకులు తెలిపారు. బుధవారం స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. పాఠశాలలపై త్రీమెన్‌ కమి టీలు, తనిఖీలు చేయడం దురదృష్టకరం, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేయడం, కొంతమంది ఫీల్డ్‌ అధికారులు అగౌరవకరమైన సం దేశాలు, హెచ్చరికలు జారీ చేయడం పాఠశాలల యాజమాన్యాలకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయన్నారు. కొంతమంది అధికారుల ఏకపక్ష నిర్ణయాల తో ఇబ్బందులకు గురవుతున్నా మని, సరైన ధ్రువపత్రాలు లేకుండానే పిల్లలను పాఠశాలల్లో చేర్చు కోవాలని బలవంతం చేయడం, షోకాజ్‌ నోటీసులతో వేధించ డం, గుర్తింపును రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్ప డడం సరికాదన్నారు. ఏకపక్ష నిర్ణయాలను విరమించి, వేధింపులను ఆపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఈవో తిరుమల చైతన్యకు సమ్మె నోటీసును అందజేశారు. కార్యక్రమంలో అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, నాయకులు కె.వేణు గోపాల్‌, మురళీకృష్ణ, జ్యోతి భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:25 AM