ఉద్యోగావకాశాల కల్పనకు ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:27 PM
యువతకు ఉద్యోగా వకాశాలు కల్పించేం దుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్థానిక ఎమ్మెల్యే మామిడిగోవిందరావు తెలిపారు.

పాతపట్నం,ఏప్రిల్10(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగా వకాశాలు కల్పించేం దుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్థానిక ఎమ్మెల్యే మామిడిగోవిందరావు తెలిపారు. గురువారం పాతపట్నంలోని ప్రభుత్వఆదర్శ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా ప్రారం భించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో మెళియాపుట్టిలో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ జిల్లా అధికారి ఉరిటి సాయికుమార్ మాట్లాడుతూ 15 ప్రైవేటుసంస్థలు ఉద్యోగ అవకాశా లిచ్చేందుకు ముందు కువచ్చాచని, 456మందిఇంటర్యూలకు హాజరు కాగా 201 మంది వివిధకంపెనీలకుఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో యువజన సంక్షేమాధికారి ప్రసాదరావు, ఎన్‌కేవై కోఆర్డినేటర్ వెంకట ఉజ్వల్, ఉపాధికల్పన జిల్లా అధికారి సుఽధారాణి, పర్యాటక శాఖాధికారి నారాయణరావు,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కణితి శ్రీరాములు పాల్గొన్నారు. కాగా పాతపట్నంలో పీఎంజే వసతిగృహ నిర్మాణానికి స్థలాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం పరిశీలించారు. రూ.2.30కోట్లతో ప్రధానమంత్రి జన్‌మన్ వసతిగృహన్ని నిర్మించనున్నారు.