Share News

లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:58 PM

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత అని, ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు.

లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత
‘సురక్షిత గ్రామ కార్యక్రమం’ పుస్తకావిష్కరణ చేస్తున్న మహిళా కమిషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ

పాత శ్రీకాకుళం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత అని, ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో లైంగిక వేధింపులను సమర వంతంగా ఎదుర్కోవడంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎక్కువగా గృహహింస కేసులు వస్తున్నాయన్నారు. రక్షణ చర్యల్లో భాగంగా విద్యా ర్థినులు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలన్నారు. మహిళలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. జిల్లాలో వ్యవసాయం, మత్స్య, జీడి తదితర పరిశ్రమల్లో పనిచేసేం దుకు వెళ్లే మహిళలు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని, అటువంటి ప్రాంతాల్లో స్థానిక ఫిర్యాదుల కమిటీ లను ఏర్పాటు చేయాలని సూచించారు. పోష్‌ చట్టంపై ఉద్యోగులకు కూడా అవగాహన లేదని, ఈ చట్టం సక్ర మంగా అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కువ మంది మహి ళలు పనిచేసే చోట స్థానిక ఫిర్యాదుల కమిటీలు ఏర్పాట య్యేలా కలెక్టర్‌తో మాట్లాడ తా నన్నారు. డా.బీఆర్‌ఏయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని మాట్లాడుతూ.. మహిళా సాధి కారత ప్రారంభమైందని, వర్సిటీ లో ఎక్కువ శాతం మహి ళలు ఉన్నారన్నారు. కార్మికశాఖ డిప్యూ టీ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత కార్మికులు పనిచేసే చోట పది మంది మహిళల కంటే ఎక్కువ మం ది ఉంటే స్థానిక కంప్లైంట్‌ కమిటీ లు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహిళా సీఐ నారీ మణి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఇబ్బందులున్నా యని పనిచేసే ప్రదేశాల్లో ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నా రని, పోష్‌ యాక్ట్‌తో స్టేషన్‌కు రాకుండా ఫిర్యాదు చేయ వచ్చని, దీనిని వినియోగించుకోవాలన్నారు. ‘సురక్షిత గ్రామ కార్యక్రమం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్య క్రమంలో బెజ్జిపురం మనోవికాస కేంద్రం అధ్యక్షుడు ప్రసా దరావు, భీమునిపట్నం ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ పెంకి సురేఖ, మహిళా కమిషన్‌ సలహాదారు రావూరి సూయిజ్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ ఐ.విమల, డా బీఆర్‌ ఏమూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ యు. కావ్యజ్యోత్స్న, ఎస్‌ఎస్‌ఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ వనజ, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 11:58 PM