75 కేంద్రాల్లో ప్రీస్కూల్ ఏర్పాటు: పీవో
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:08 AM
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠ శాల ఆవరణలో నిర్వహించి ప్రీస్కూల్ తరగతుల నిర్వహణకు మందస ఐసీడీఎస్ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసినట్లు పీవో పెద్దింటి అరుణ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే 75 కేంద్రాలను తనిఖీ చేసి ప్రీస్కూల్ నిర్వహణకు ఏర్పాట్లు చేసి నట్లు చెప్పారు.
హరిపురం, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి):అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠ శాల ఆవరణలో నిర్వహించి ప్రీస్కూల్ తరగతుల నిర్వహణకు మందస ఐసీడీఎస్ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసినట్లు పీవో పెద్దింటి అరుణ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే 75 కేంద్రాలను తనిఖీ చేసి ప్రీస్కూల్ నిర్వహణకు ఏర్పాట్లు చేసి నట్లు చెప్పారు. సోమవారం మందస మండలంలోని పిడిమందస అంగన్‌వాడీకేంద్రా న్ని పరిశీలించారు.ఈసందర్భంగా మాట్లాడుత ప్రాజెక్టు పరిఽధిలోని 176 కేంద్రాల్లో భవనాలు లేని 48 కేంద్రాలకు ప్రీస్కూల్‌తో ప్రభుత్వానికి అద్దె భారం తగ్గుతుందని చెప్పారు.మందస-1, సిరిపురం కేంద్రాలకు కార్యకర్తల పోస్టులు ఖాళీగాఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ రామలక్ష్మి పాల్గొన్నారు.